BDK: సింగరేణి సహకారంతో కొత్తగూడెం క్లబ్ లో ఈ నెల 11 నిర్వహించే మెగా జాబ్ మేళాను యువత సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కోరారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ శాలెం రాజుతో కలిసి దీనికి సంబందించిన బ్రోచర్‌ను ఆవిష్కరించారు.