టిడిపి నేత ఏవీ సుబ్బారెడ్డి (AV Subbareddy)పై దాడి కేసులో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ (Akhilapriya) దంపతులకు నంద్యాల కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. న్యాయమూర్తి ఆదేశాల మేరకు వారిద్దర్నీ పోలీసులు కర్నూలు జైలుకు తరలించారు.
టిడిపి నేత మాజీ మంత్రి భూమా అఖిలప్రియ కు కోర్టులో చుక్కెదురయింది. ఆమె బెయిల్ పిటిషన్ ను కొట్టివేస్తూ రిమాండ్ కు ఆదేశించింది నంద్యాల కోర్టు(Court of Nandyala). నంద్యాల ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ కోర్టులో భూమా అఖిల ప్రియను ఆమె భర్త భార్గవ్ రామ్ ను మరో ఇద్దరిని హాజరు పరిచారు పోలీసులు. ఈ సందర్భంగా తనకు బెయిల్ ఇవ్వాలంటూ అఖిలప్రియ, ఆమె భర్త JFCM ఇంచార్జ్ జడ్జి ఆదినారాయణకు విన్నవించుకున్నారు.. ఈ దాడి కేసులో అఖిలప్రియ దంపతులకు నంద్యాల కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. జడ్జి ఆదేశాల మేరకు పోలీసులు వారిని కర్నూలు (Kurnool) జైలుకు తరలించారు.
టీడీపీ నేత నారా లోకేష్ (Nara Lokesh) పాదయాత్ర సందర్భంగా ఏవీ సుబ్బారెడ్డిపై ఆ పార్టీకే చెందిన భూమా అఖిలప్రియ వర్గీయులు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ దాడిలో ఏవీ సుబ్బారెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం, ఘటనపై కేసు నమోదు చేసిన నంద్యాల పోలీసులు.. ప్రాథమిక దర్యాప్తు అనంతరం భూమా అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ్‌రామ్, ఆమె అనుచరులను అరెస్ట్ చేశారు. ఏవీ సుబ్బారెడ్డిపై దాడి జరిగిన ఘటనలో అఖిలప్రియను అరెస్ట్ చేసి పాణ్యం పోలీస్ స్టేషన్(Panyam Police Station) కు తరలించారు పోలీసులు. సెక్షన్ 307 కింద అఖిలప్రియపై కేసు నమోదు చేశారు. ఆ తర్వాత ఆమెను కోర్టులో హాజరుపరిచారు. అఖిలప్రియ దంపతులిద్దరికీ కోర్టు రిమాండ్ విధించింది.