WGL: TG రాష్ట్రంలో ఉదయం 8:30 నుంచి 11 గంటల వరకు భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. అయితే ముఖ్యంగా వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ, యాదాద్రి భువనగిరి జిల్లా అదగుడూర్ మండలం అదగుడూర్ 91 మి.మీ. వర్షం నమోదయి అగ్రస్థానంలో నిలిచాయి. దీంతో ఉమ్మడి జిల్లా ప్రజలు మరో నాలుగు రోజులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.