SRKL: రణస్థలం మండలం దేశాంలో ఆదివారం నేషనల్ మెడికోస్ ఆర్గనైజేషన్ ఆంధ్రప్రదేశ్ (NMO-AP) సేవా భారతి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరాన్ని స్థానిక ఎంపీటీసీ సభ్యుడు దన్నాన వంశీకృష్ణ ప్రారంభించి మాట్లాడారు. వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం వైద్యులు 53 మందికి వైద్య పరిక్షలు చేశామని తెలిపారు.