»2615 People In Karnataka Assembly Election Polling 2023
Karnataka election 2023: పోలింగ్ షురూ..బరిలో 2,615 మంది
కర్ణాటక 2023 అసెంబ్లీ(karnataka election 2023) ఎన్నికల ఓటింగ్(voting) ప్రక్రియ ప్రారంభమైంది. 224 మంది సభ్యులున్న కర్ణాటక అసెంబ్లీకి 2,615 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో 2,430 మంది పురుషులు, 184 మంది మహిళలు, ఒకరు థర్డ్ జెండర్ ఉన్నారు.
కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల(karnataka election 2023) పోలింగ్(polling) మొదలైంది. ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైన ఈ ఎన్నికల పోలింగ్.. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. గత 40 రోజులుగా కొనసాగిన పోటాపోటీ ప్రచారం సోమవారం సాయంత్రంతో ముగిసింది. దీంతో మంగళవారం అభ్యర్థులంతా ఇంటింటి ప్రచారానికి పరిమితమయ్యారు.
మరోవైపు కర్ణాటకలో మొత్తం 5,31,33,054 మంది ఓటర్లు(voters) ఉండగా.. రాష్ట్రవ్యాప్తంగా 58,545 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. వీరిలో 2,67,28,053 మంది పురుషులు, 2,64,00,074 మంది మహిళలు ఉండగా 4,927 మంది ఇతరులు ఉన్నారు.
ఇక రాష్ట్రంలోని మొత్తం 224 స్థానాలకు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో.. బీజేపీ(BJP), కాంగ్రెస్(congress), జేడీఎస్(JDS) ప్రధానంగా పోటీపడుతున్నాయి. మొత్తం 2,165 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో BJP, కాంగ్రెస్, జేడీఎస్ తోపాటుగా జాతీయ, రాష్ట్ర పార్టీలు కూడా ఈ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. 918 మంది స్వతంత్రులతో కలిపి మొత్తం 2,613 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.
అయితే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో.. మొత్తం 224 స్థానాలకు ఒకే దఫాలో పోలింగ్ జరుగుతుంది. ఈ నెల 13న ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టనున్నారు. ఇక కర్నాటక అసెంబ్లీలోని 224 స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ నిర్వహిస్తున్నారు. బరిలో 16 పార్టీలు ఉన్నా కూడా పోటీ మాత్రం ప్రధాన పార్టీలైన BJP, కాంగ్రెస్, JDS మధ్యే నెలకొంది.
మొత్తం 2,615 మంది అభ్యర్థులు బరిలో ఉండగా..ఈసారి పోటీ చేస్తున్న వారిలో మహిళల సంఖ్య చాలా తక్కువగా ఉంది. మొత్తం 224 స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ 223 స్థానాల్లో అభ్యర్థులను నిలిపింది. ఒక స్థానంలో సర్వోదయ పార్టీ అభ్యర్థికి కాంగ్రెస్ మద్దతు ప్రకటించింది. ఈ నేపథ్యంలో కర్నాటక వ్యాప్తంగా 58 వేల 545 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల్లో 918 మంది ఇండిపెండెంట్లు కూడా బరిలో ఉన్నారు.
ఈ క్రమంలో ఓటర్లు ఏ పార్టీకి ఎక్కువగా ఓట్లు వేస్తారు? ఎవరిని సీఎంగా చేసే అవకాశం ఉంది? కర్ణాటకలో మళ్లీ ఏ పార్టీ నేత సీఎం సీట్లో కూర్చుంటారు? అనేది తెలియాలంటే ఈ నెల 13 వరకు ఆగాల్సిందే. మరోవైపు బీజేపీ, కాంగ్రెస్ ఇరు పార్టీలు గెలుపు ధీమాతో ఉన్నాయి.