»Naga Chaitanya Once Again Speaks About His Divorce
Samanthaతో విడాకులు.. ఇకనైనా వార్తలు ఆపండి: నాగ చైతన్య
కోర్టు విడాకులు మంజూరు చేసి ఏడాది అవుతుందని.. ఇప్పటికీ ఆ విషయం గురించి డిస్కష్ చేయడం సరికాదని నాగ చైతన్య అంటున్నారు. కస్టడీ మూవీ ప్రమోషన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
Naga Chaitanya Once Again Speaks About His Divorce
Naga Chaitanya:నాగ చైతన్య (Naga Chaitanya)- సమంత విడిపోయినప్పటికీ మీడియాలో ఎప్పుడూ వీరి గురించి చర్చే. వీరికి సంబంధించి కొత్త సినిమా వచ్చిందంటే చాలు.. పర్సనల్ విషయాలు ప్రస్తావనకు వస్తాయి. నాగ చైతన్య (Naga Chaitanya) కస్టడీ మూవీ ఈ నెల 12వ తేదీ శుక్రవారం రిలీజ్ కానుంది. మూవీ ప్రమోషన్ కార్యక్రమాల్లో చైతు పాల్గొంటున్నారు. తాజాగా మరోసారి విడాకుల గురించి మాట్లాడారు.
‘సమంతతో విడిపోయా.. ఏడాది క్రితం కోర్టు విడాకులు మంజూరు చేసింది. సినిమాల గురించి మాట్లాడుకున్నా ఫర్లేదు.. కానీ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతుంటే బాధేస్తోంది. మీడియా హెడ్ లైన్స్ కోసం తమ పేరు వాడటం బాధాకరం. కొన్ని కారణాల వల్ల ఇద్దరం విడిపోయాం. తాము కలిసి ఉన్న సమయంపై ఎంతో గౌరవం ఉంది. రెండేళ్లుగా మీడియాలో ఈ విషయంపై వస్తోన్న రూమర్స్ ఆ గౌరవానికి భంగం కలుగుతుంది. తమతో సంబంధం లేని మూడో వ్యక్తిని ఇందులోకి లాగడం భావ్యం కాదు. ఆ కుటుంబం ఎంతో బాధపడుతుందని ఆలోచించడం లేదు. విడాకులపై సామ్, తాను స్టేట్ మెంట్ ఇచ్చామని.. ఇకనైనా ఆ విషయాన్ని వదిలేస్తారని ఆశిస్తున్నాను’ అని నాగ చైతన్య (Naga Chaitanya) స్పష్టం చేశారు.
కస్టడీ (custody) మూవీ ప్రమోషన్ సందర్భంలో చైతుకు విడాకుల గురించి ప్రశ్నలే ఎదురవుతున్నాయి. ఇటీవల చాలా సందర్భాల్లో నవ్వుతూ సమాధానం చెప్పిన ఆయన.. ఓపిక నశించినట్టు ఉంది. అందుకే ఇకపై తమ విడాకుల గురించి ప్రస్తావించొద్దు అని కోరారు.
కస్టడీ (custody) మూవీని వెంకట్ ప్రభు తెరకెక్కించారు. మూవీలో చైతు (Naga Chaitanya) పక్కన కృతి శెట్టి నటిస్తోంది. మూవీలోని పాటలు, ట్రైలర్ సినిమా హైప్ పెంచేసింది. ప్రమోషన్ కార్యక్రమాల్లో చైతన్య (Naga Chaitanya) బిజీగా ఉన్నారు. విడాకుల విషయం ప్రస్తావించే సరికి.. అసహనానికి గురయ్యారు. కొన్ని మీడియా సంస్థల లక్ష్యంగా కామెంట్స్ చేశారు.