గుంటూరు తూర్పు MLA నసీర్ శనివారం TNSF నియోజకవర్గ కమిటీకి నియామక పత్రాలు అందజేశారు. కమిటీ అధ్యక్షుడిగా శివసాయి పవన్ ఎన్నికయ్యాడు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నసీర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వం విప్లవాత్మక చర్యలు తీసుకుంటోందని, ప్రతి విద్యార్ధికి తగిన అవకాశాలు అందించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు.