Game Changer Movie: ‘గేమ్ ఛేంజర్’ కోసం మోకోబోట్ కెమెరా!
ఇప్పుడంటే ఆధునిక టెక్నాలజీ అందుబాటులో ఉంది గానీ.. పెద్దగా టెక్నాలజీ తెలియని రోజుల్లోనే.. బిగ్ స్క్రీన్ పై మ్యాజిక్ క్రియేట్ చేశాడు స్టార్ డైరెక్టర్ శంకర్. జెంటిల్‌మేన్ మొదలుకొని.. లాస్ట్ ఫిల్మ్ రోబో2.0 వరకు శంకర్ సినిమాల్లో వాడే టెక్నాలజీ, గ్రాఫిక్స్ చూస్తే ఫిదా అవాల్సిందే. అందుకే ఈసారి మెగావపర్ స్టార్ రామ్ చరణ్ కోసం మోకో బోట్ కెమెరా వాడుతున్నారు. ఇంతకు ముందే ఈ కెమెరాని సినిమాల్లో వాడినా.. ఇప్పుడు శంకర్ దీన్ని ఎలా వాడుతున్నాడనేది ఇంట్రెస్టింగ్గా మారింది.
ట్రిపుల్ ఆర్(RRR) తర్వాత చరణ్ చేస్తున్న సినిమా గేమ్ ఛేంజర్(Game Changer Movie). దిల్ రాజు(Dil Raju) ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం శంషాబాద్‌లో వేసిన భారీ సెట్లో క్లైమాక్స్ సీన్స్ షూట్ చేస్తున్నాడు. దీనికోసం మోకోబోట్ కెమెరాని వాడుతున్నాడట శంకర్. ఈ కెమెరా స్పెషాల్టీ ఏంటంటే.. హై స్పీడ్ విజువల్స్‌ని క్యాప్చర్ చెయ్యడంలో అద్భుతంగా పని చేస్తుంది. గతంలో బీస్ట్, తునివు సినిమాలకి ఈ కెమెరాని వాడారు. అలాగే కమల్ హాసన్, లోకేష్ కనగరాజ్ బ్లాక్ బస్టర్ మూవీ ‘విక్రమ్’లోను ఈ కెమెరాను వాడారు. ఈ మూవీ ఇంటర్వెల్ ఫైట్‌లో కమల్ మాస్క్ తీసేసి చేసే ఫైట్ ఆడియన్స్ అదరహో అనేలా ఉంటుంది. ఈ యాక్షన్ సీక్వెన్స్‌ను మోకో బోట్ కెమెరాతో షూట్ చేసారు. అలాంటి కెమెరాను టెక్నికల్‌గా బాప్ అయిన శంకర్.. ఇంకెలా వాడుతాడో ఊహించుకోవచ్చు. ఇప్పటికే ఒక్కో పాటకు, ఫైట్ కోట్లకు కోట్లు ఖర్చు చేసినట్టు వార్తలు వస్తునే ఉన్నాయి. ఇక ఇప్పుడు క్లైమాక్స్‌ను ఓ రేంజ్లో తెరకెక్కిస్తున్నాడు. ఏకంగా 1200 మంది ఫైటర్లతో షూట్ చేస్తున్నాడనే టాక్ నడుస్తోంది. ఇక ఇప్పుడు మోకోబోట్ కెమెరాను వాడుతున్నాడని తెలియడంతో.. అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇక గేమ్ ఛేంజర్ సినిమాని వచ్చే సంక్రాంతి లేదా సమ్మర్‌కి రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నాడు దిల్ రాజు. కీయరా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీకి తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.