HYD: గత 30 ఏళ్లలో దేశంలోని ప్రధాన నగరాల్లో నిర్మాణాల విస్తీర్ణం రెట్టింపైందని ‘సిటీస్ ఇన్ మోషన్’ పేరుతో స్వైర్యార్డ్స్ సంస్థ వెల్లడించింది. హైదరాబాద్లో ప్రస్తుతం బిల్టప్ ఏరియా 519 చ.కి.మీ.గా ఉండగా, 1995లో 267 చ.కి.మీ. మాత్రమే ఉంది. ఈ మధ్యకాలంలో 252 చ.కి.మీ. పెరిగి, 95% వృద్ధి నమోదయింది.