E.G: కొవ్వూరు బస్ స్టేషన్ రాష్ట్రస్థాయి స్వచ్ఛ బస్ స్టేషన్లలో ద్వితీయ స్థానం సాధించింది. ఈ విషయాన్ని డిపో మేనేజర్ ఎన్. అభిరాం నాయక్ తెలిపారు. మాజీ డిపో మేనేజర్ వైవీఎన్ కుమార్ కృషి ఫలితమని ఆయన శనివారం పేర్కొన్నారు. భవిష్యత్తులో మొదటి స్థానం సాధించేందుకు కృషి చేస్తామని డీఎం చెప్పారు.