MDK: పాపన్నపేట మండలంలోని కొడపాక, సీతానగర్ గ్రామాల్లో దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం దుర్గామాత నిమజ్జనం శోభాయాత్రలో మెదక్ బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే పద్మదేవేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి, మండల నాయకులతో కలసి పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో అనేక మంది భక్తులు పాల్గొన్నారు.