AP: చిత్తూరు జిల్లా దేవలంపేటలో అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టిన ఘటనపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. జాతీయ నాయకులకు అవమానం కలిగేలా ప్రవర్తిస్తే ఎంతటివారికైనా శిక్ష తప్పదని హెచ్చరించారు. ఘటనపై విచారణ జరిపి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. కాగా ఈ ఘటనపై దళిన నేతల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.