AP: తీవ్ర వాయుగుండం ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు శ్రీకాకుళం జిల్లాలోని గొట్టా బ్యారేజ్ వద్ద వంశధార నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో రెండో హెచ్చరిక జారీ చేసిన అధికారులు తీర ప్రాంత ప్రజలకు అప్రమత్తం చేశారు. ప్రస్తుతం బ్యారేజీకి 73000 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా.. 23 గేట్లు ఎత్తి అంతే మొత్తంలో నీటిని కిందికి వదులుతున్నారు.