NLR: తిరుమల క్షేత్రంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో ఐదో రోజైన ఆదివారం మలయప్పస్వామి మోహిని అవతారంలో దర్శనం కల్పించారు. స్వామివారి వాహన సేవలో నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు మెంబర్ వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి దంపతులు పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకుని ప్రసాదాలను స్వీకరించారు.