TG: BCలకు 42శాతం రిజర్వేషన్లపై హైకోర్టులో విచారణ మొదలైంది. పిటిషనర్ల తరఫున సీనియర్ లాయర్లు ప్రభాకర్, మయూర్ రెడ్డి వాదనలు వినిపిస్తున్నారు. ప్రభుత్వం తరఫున ఏజీ సుదర్శన్ రెడ్డి ఆన్లైన్లో హాజరయ్యారు. జీవో గెజిట్ కానప్పుడు ఎందుకు ఆందోళన చెందుతున్నారని ధర్మాసనం ప్రశ్నించింది. BCలకు 42శాతం రిజర్వేషన్లు ఇవ్వడం రాజ్యాంగ విరుద్దమని పిటిషనర్లు అన్నారు.