సుడిగాలి సుధీర్ అంటే తెలియని వారుండరు. ప్రస్తుతం బుల్లితెరను ఏలుతున్న వారిలో సుధీర్‌దే ఫస్ట్ ప్లేస్. నెగెటివ్‌ను పాజిటివ్‌గా తీసుకోవడం మాత్రమే తెలిసిన సుధీర్‌కు.. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందుకే సుధీర్ ఎలాంటి ప్రోగ్రామ్ చేసిన టీఆర్పీ రికార్డులు బద్దలవుతుంది. ఇక బుల్లితెర హీరోగా దూసుకుపోతున్న సుడిగాలి సుధీర్..
బిగ్ స్క్రీన్ హీరోగా కూడా రాణిస్తున్నాడు. గతంలో సాఫ్ట్వేర్ సుధీర్, త్రీ మంకీస్ వంటి సినిమాలతో అలరించిన సుధీర్.. కొద్ది రోజుల క్రితం ‘వాంటెడ్ పండుగాడ్’ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమా గాలోడిని తీవ్ర నిరాశపరిచింది. అందుకే తాజాగా గాలోడు సినిమాతో థియేటర్లోకి వచ్చాడు.
ఈ సినిమాతో మాస్ ఆడియెన్స్‌కు మరింత దగ్గరవాలని చూస్తున్నాడు సుధీర్. ఈ వారం రిలీజ్ అయిన గాలోడు సినిమాకు యావరేజ్ టాక్ వస్తోంది. కానీ సుధీర్ ఫర్ఫార్మెన్స్ అదిరిపోయిందంటున్నారు. ఈ నేపథ్యంలో గాలోడు మూవీ బడ్జెట్ ఎంత.. సుధీర్ రెమ్యునరేషన్ ఎంత.. అనే విషయాలపై ఆసక్తికర చర్చ జరుగుతుంది.
ఇప్పటివరకు సుధీర్ నటించిన సినిమాల్లో ఇదే ఎక్కువ బడ్జెట్ మూవీ అంటున్నారు. దాదాపు రెండున్న కోట్లకు పైగా గాలోడు కోసం ఖర్చు పెట్టినట్టు సమాచారం. ఇక జబర్దస్త్ షోతో వందలతో మొదలైన సుధీర్ పారితోషికం.. ఇప్పుడు బుల్లి తెర షోలతోనే లక్షలకు చేరింది. దాంతో గాలోడు సినిమా కోసం దాదాపు 40 నుంచి 50 నుంచి లక్షల అందుకున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమా హిట్ అయితే.. సుధీర్ పారితోషికం మరింతగా పెరుగుతుందని అంటున్నారు.