కోనసీమ: అన్నదాతలకు వ్యవసాయ సాగులో సహకారం అందించేందుకు ఏర్పడిన సహకార సొసైటీల రుణాలు రైతులు సకాలంలో తిరిగి చెల్లించకపోవడంతో బకాయిలు పేరుకుపోతున్నాయి. ఆత్రేయపురం డీసీసీబీ బ్రాంచి పరిధిలో ఆత్రేయపురం, వద్దిపర్రు, లొల్ల, వెలిచేరు, పులిదిండి, వసంతవాడ, రాజవరం, గ్రామాల్లోని 7 సహకార సొసైటీలలో రైతుల నుంచి 6.32 కోట్లు వసూలు కావాల్సి ఉందని అధికారులు తెలిపారు.