ATP:గుత్తి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆరు నెలలుగా బైక్స్ చోరీకి గురవుతున్నాయి. బాధితుల ఫిర్యాదుతో సీఐ రామారావు, ఎస్సైలు సురేష్, గౌతమ్ పోలీసు సిబ్బందితో కలిసి బైక్స్ ల దొంగ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గుత్తి మండలం గాజులపల్లి గ్రామానికి చెందిన బైకుల దొంగను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నారు. త్వరలో మరిన్ని వివరాలు తెలియజేస్తామన్నారు.