ASR: జీ.మాడుగుల మండలంలో పీఎం జన్ మన్ కింద మంజూరైన 3 అంగన్వాడీ పోస్టులు భర్తీ చేస్తున్నామని ఐసీడీఎస్ ప్రాజెక్టు సీడీపీవో చంద్రమణిదేవి తెలిపారు. గెమ్మెలిబారు, బంగారుబూడి, కర్జాపల్లి అంగన్వాడీ కేంద్రాల్లో ఆయా పోస్టులకు స్థానికంగా నివాసం ఉంటున్న ఎస్టీ వివాహిత మహిళా అభ్యర్ధులు అక్టోబర్ 8వ తేదీలోగా నేరుగా ఐసీడీఎస్ కార్యాలయంలో ధరఖాస్తు చేసుకోవాలని సూచించారు.