WGL: వరంగల్ శ్రీ భద్రకాళి ఆలయంలో శ్రీ దేవీ శరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా ఆరో రోజు భువనేశ్వరి దేవి అవతారంలో అమ్మవారు దర్శనం ఇచ్చారు. శనివారం తెల్లవారుజామునే ఆలయాన్ని తెరిచి అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు చేశారు. అనంతరం అర్చకులు విశేషమైన పూజలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుంటున్నారు.