GNTR: మంగళగిరి స్వస్థ్ నారి సశక్త్ పరివార్ అభియాన్ పేరిట ఆరోగ్య శిబిరాన్ని శనివారం గణపతి నగర్లోని ఇందిరానగర్ అర్బన్ ప్రైమరీ ఆరోగ్య కేంద్రంలో నిర్వహించనున్నట్లు వైద్యాధికారిని డాక్టర్ పి. అనూష శుక్రవారం తెలిపారు. ఎయిమ్స్, గుంటూరు జీజీహెచ్ నుంచి వివిధ విభాగాల ప్రత్యేక వైద్య నిపుణులు హాజరై సేవలందిస్తారని పేర్కొన్నారు.