HYD: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ల వద్ద రైళ్ల టెర్మినల్స్ మార్పు చేసినట్లు సికింద్రాబాద్ దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. డిసెంబర్ 26 వరకు పూణె – సిల్చేర్, దర్భంగా-యశ్వంతపూర్, అగర్తల-ముజఫర్ నగర్ ప్రాంతాలకు వెళ్లే రైళ్లు సికింద్రాబాద్ టెర్మినల్ వద్ద కాకుండా వేరే టర్మినల్స్ నుంచి వెళ్తాయని అధికారులు పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించాలని సూచించారు.