E.G: రాజానగరం నియోజకవర్గం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ నియోజకవర్గంలో సత్యసాయి డ్రింకింగ్ వాటర్ సమస్యను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ దృష్టికి తీసుకెళ్లారు. వారు వెంటనే స్పందించి సత్యసాయి డ్రింకింగ్ వాటర్ పథకానికి రూ.1 కోటి నిధులు విడుదల చేశారు. ఈ నిధులతో సిబ్బంది జీతాలు ఇవ్వనున్నారు.