KMM: మధిర పట్టణంలోని లడక బజారులో దేశభక్త యువజన సంఘం ఆధ్వర్యంలో శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఐదవ రోజు శుక్రవారం అమ్మవారు ధనలక్ష్మి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ సందర్భంగా కమిటి నిర్వాహకులు అమ్మవారి మండపాన్ని సుమారు మూడు లక్షల నగదుతో సుందరంగా అలంకరించారు. దీంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.