ATP: అనంతపురంలోని సాయి నగర్లో చెత్త కుప్పలో నవజాత శిశువు లభ్యమైన విషయం తెలిసిందే. ఆ శిశువు పట్ల కొందరు మహిళలు మమకారం చూపించారు. ఆ పసికందును ఇస్తే, పెంచుకుంటామని పోటీపడ్డారు. పాపను తమకు ఇవ్వాలని అధికారుల వద్ద ప్రాధేయపడ్డారు. అయితే నిబంధనల మేరకు దత్తత తీసుకోవాల్సి ఉంటుందని వారు బదులిచ్చారు.