కృష్ణా: నర్వ మండలంలో శుక్రవారం ఉదయం మోస్తరు వర్షం కురిసింది. తెల్లవారుజామున కురుస్తున్న వర్షానికి వ్యాపారులు ఇబ్బంది పడ్డారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో గ్రామాలు, పొలాలు జలమయమయ్యాయి. వర్షాల తీవ్రత కారణంగా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంట పొలాల్లో నీరు చేరడంతో పంట నష్టపోతున్నామని, ముఖ్యంగా వరి, పత్తి పంటలు దెబ్బతిన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.