WGL: వరంగల్ పట్టణ కేంద్రంలోని భద్రకాళి ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఐదో రోజైన శుక్రవారం అమ్మవారు లలితా త్రిపుర సుందరిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం అర్చకులు అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, విశేష పూజలు నిర్వహించారు. పండగ సెలవుల కారణంగా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.