ADB: జల్ సంచయ్ జన్ భగీరథి అవార్డుకు జిల్లా మొదటి స్థానంలో ఎంపిక కావడం జరిగిందని కలెక్టర్ రాజర్షి షా గురువారం తెలిపారు. జిల్లాలో పూర్తి అయిన 98 వేల 697 పనులను కేంద్ర బృందంచే తనిఖీ చేసినట్లు పేర్కొన్నారు. దీంతో జిల్లాలో భూగర్భ జలాల అభివృద్ధి, వ్యవసాయ ఆధారిత పనులకు ఎంతో లబ్ది చేకూరుతుందన్నారు. ఈ మేరకు రూ.2 కోట్ల అవార్డు కేంద్రం ప్రకటించిందని తెలిపారు.