ఐపీఎల్(IPL) 16వ సీజన్ రసవత్తరంగా సాగుతోంది. మార్చి 31వ తేదిన ఈ సీజన్ ఐపీఎల్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ట్రోఫీ కోసం నువ్వా నేనా అనే రీతిలో ఆటగాళ్లు తలపడుతున్నారు. ప్రతి మ్యాచ్ కూడా ఉత్కంఠభరితంగా సాగుతోంది. క్రికెట్ అభిమానుల(Cricket Fans)కు పండగ వాతావరణం నెలకొంటోంది. తాజాగా ఐపీఎల్ 2023(IPL 2023) సీజన్ కు సంబంధించి ప్లే ఆఫ్ మ్యాచుల షెడ్యూల్‌ను బీసీసీఐ(BCCI) విడుదల చేసింది.
70 మ్యాచులతో కూడిన ఐపీఎల్(IPL) లీగ్ దశ మే 21వ తేదీన ముగియనున్నట్లు బీసీసీఐ(BCCI) వెల్లడించింది. మే 22వ తేది నుంచి ప్లే ఆఫ్ మ్యాచులు ఉంటాయని తెలిపింది. క్వాలిఫయర్ 1 మ్యాచ్ చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరుగుతుందని బీసీసీఐ తెలిపింది. అలాగే క్వాలిఫయర్ 2, ఫైనల్ మ్యాచులకు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక కానున్నట్లు బీసీసీఐ వెల్లడించింది.
ఇకపోతే ప్లే ఆఫ్ షెడ్యూల్(Schedule) వివరాలు చూస్తే..మే 23న క్వాలిఫయర్1 చెన్నైలో జరగనుంది. మే 24న ఎలిమినేటర్ మ్యాచ్ చెన్నైలో నిర్వహించనున్నారు. మే 26న క్వాలిఫయర్2 అహ్మదాబాద్ లో జరగనుంది. మే 28వ తేదీన ఫైనల్ మ్యాచ్(Final Match) జరగనుంది. ఈ మ్యాచ్ కు అహ్మదాబాద్ స్టేడియం వేదిక కానున్నట్లు బీసీసీఐ(BCCI) షెడ్యూల్ విడుదల చేసింది.