ప్రకాశం: అర్ధవీడు మండలంలోని గన్నేపల్లి గ్రామంలో గురువారం దారుణ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే గ్రామంలోని ఓ వ్యక్తిని మరో వ్యక్తి కర్రతో దాడి చేసి అతి క్రూరంగా హత్య చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే ఈ ఘటనపై మరిన్ని వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.