AP: తిరుమలలో వేంకటాద్రి నిలయం యాత్రికుల వసతి సముదాయంను ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, సీఎం చంద్రబాబు ప్రారంభించారు. అనంతరం వసతి గృహం బుకింగ్ కౌంటర్‌ను పరిశీలించారు. నూతన వసతిగృహంలో తొలి బుకింగ్ టోకెన్‌ను భక్తులకు అందించారు. కాగా, ముందస్తు బుకింగ్ లేకున్నా భక్తులకు వసతి కల్పించేలా రూ.102 కోట్లతో నూతన కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టారు.