ప్రముఖ ఫిన్‌టెక్ ప్లాట్‌ఫామ్ ఫోన్‌పే త్వరలో భారీ ఐపీఓ ద్వారా స్టాక్ మార్కెట్లలోకి అడుగుపెట్టనుంది. మదుపర్ల నుంచి రూ.12,000 కోట్లను సేకరించే లక్ష్యంతో సెబీకి ఫోన్‌పే డ్రాఫ్ట్ పేపర్లు అందజేసింది. స్టాక్ మార్కెట్లలో లిస్టింగ్ అయ్యేందుకు ప్రీ-ఫైలింగ్ మార్గంలో IPO కోసం దాఖలు చేసింది. ఆఫర్ ఫర్ సేల్ విధానంలోనే నిధుల సమీకరణ చేపట్టనుంది.