MNCL: ముదిరాజ్ సామాజిక వర్గాన్ని బీసీ డి నుంచి బీసీ ఏ గ్రూపులోకి మార్చాలని ముదిరాజ్ మహాసభ రాష్ట్ర కార్యదర్శి దబ్బెట తిరుపతి కోరారు. ఈ మేరకు సోమవారం రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరిని కలిసి వినతిపత్రం అందజేశారు. ముదిరాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి వడ్డీ లేని రుణాలు అందించాలని, గ్రామీణ ప్రాంత ముదిరాజ్ లకు చేపల చెరువులు కేటాయించాలని కోరారు.