సత్యసాయి: పుట్టపర్తిలో జిల్లా అధికారులతో జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్వచ్ఛ-ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేయాలని ఆదేశించారు. ప్రతి మూడవ శనివారం ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టి, ప్రజలు, విద్యార్థులను భాగస్వామ్యం చేయాలని సూచించారు.