ATP: బ్రహ్మసముద్రం మండలం కోనాపురం గ్రామంలో రైతు సోమశేఖర్ పొలంలో గురువారం రాత్రి విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ను పగలగొట్టి అందులోని రాగి తీగలను గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు. రైతు సోమశేఖర్ శుక్రవారం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి, ఈ చోరీ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.