NZB: నగరంలోని బాబన్ సహబ్ ప్రాంతంలో నిషాత్ ఆఫ్రిన్ ఇంట్లో కిటికీ గ్రిల్ తొలగించి గుర్తు తెలియని వ్యక్తులు భారీ చోరీకి పాల్పడ్డారు. నిషాత్ బుధవారం ఇంటికి తాళం వేసి ఫంక్షన్కు వెళ్లి గురువారం వచ్చే సరికి ఈ చోరీ జరిగింది. సుమారు రూ.10 లక్షల విలువైన విదేశీ నగదు, 10 తులాల బంగారం అపహరణకు గురైనట్లు బాధితులు పోలీసులకు తెలిపారు.