SRD: సంగారెడ్డి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణ భారీ వర్షానికి చెరువును తలపిస్తోంది. వర్షం నీరు పాఠశాల ఆవరణలో నిలిచిపోవడంతో విద్యార్థులు తరగతి గదులకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆవరణలో మట్టి పోసి, నీటిని బయటకు పంపే ఏర్పాట్లు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు అధికారులను కోరుతున్నారు.