ADB: విద్యార్థులు చదువుతోపాటు ఆటల్లోనూ రాణించాలని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పేర్కొన్నారు. నెరడిగొండ మండలంలోని బుగ్గరం (బి) గ్రామంలో గల గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాల విద్యార్థినిలు హ్యాండ్ బాల్ పోటీల వసతి ఖర్చుల కొరకు రూ. 5వేల అందజేసి ఆశీర్వదించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రాథోడ్ సజన్, నాయకులు రాథోడ్ సురేందర్ ఉన్నారు.