BDK: పాల్వంచ ప్రభుత్వ డిగ్రీకళాశాల(అటానమస్)లో ఇవాళ హిందీ భాషా దినోత్సవం ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పద్మ, హిందీ శాఖ అధ్యక్షురాలు డాక్టర్ టి అరుణకుమారిలు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ.. హిందీ భాష ప్రాముఖ్యత వివరిస్తూ హిందీ భాష భారతదేశము యొక్క సంస్కృతి, ఐక్యత, ఆత్మ గౌరవానికి ప్రతీక అని పేర్కొన్నారు.