AKP: మాకవరపాలెం మండలం రాచపల్లిలో ఏపీఐఐసీ భూములను రాష్ట్ర పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్ సందర్శించారు. వాటికి సంబంధించిన మ్యాప్ పరిశీలించారు. మండలం నుంచి ఎలమంచిలికి నిర్మించనున్న రహదారి ప్రాంతాన్ని పరిశీలించారు. రహదారి నిర్మాణానికి సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ విజయకృష్ణన్, ఆర్డీవో రమణ, తహసీల్దార్ వెంకటరమణ పాల్గొన్నారు.