PDPL: పేద ప్రజల సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగుతుందని రాష్ట్ర మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మహమ్మద్ ఓబేదుల్లా కోత్వాల్ సాహెబ్ అన్నారు. బుధవారం పెద్దపల్లిలో జరిగిన తెలంగాణ ప్రజా పాలన కార్యక్రమంలో ఆయన పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణరావు, కలెక్టర్ కోయ శ్రీహర్ష పాల్గొన్నారు.