ప్రకాశం: కొమరోలులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అధ్యాపకులు వికృత చేష్టలు చేస్తున్నట్లు విద్యార్థులు అధికారులకు లేఖల రూపంలో ఫిర్యాదు చేశారు. గుంటూరు ఆర్జేడీ పద్మజ సోమవారం కళాశాలలో విచారణ చేపట్టి నలుగురు అధ్యాపకులను తాత్కాలికంగా విధుల నుంచి తొలగిస్తున్నామన్నారు. బోధనేతర సిబ్బందిని డిప్యూటేషన్‌పై వేరే కళాశాలకు పంపించామని తెలిపారు.