AP: మహిళా సాధికారతకు కృషిచేసిన NTRకు ప్రణామాలు అని రాజ్యసభ DY. ఛైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ అన్నారు. అభివృద్ధి చెందిన చాలా దేశాలు మహిళల హక్కులకు ప్రాధాన్యత ఇచ్చాయన్నారు. స్థానిక ఎన్నికల్లో బీహార్ తొలిసారిగా మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు చేసినట్లు గుర్తుచేశారు. మహిళల సాధికారతకు మోదీ అనేక కార్యక్రమాలు చేపట్టారని, జన్‌ధన్ ఖాతాల్లో సగానికిపైగా మహిళల ఖాతాలు ఉన్నాయన్నారు.