కోనసీమ: అమలాపురం నియోజకవర్గంలో ఈరోజు జరగాల్సిన స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ వాయిదా వేస్తున్నట్లు డీఎస్ఓ ఉదయ భాస్కర్ ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు అందుబాటులో లేని కారణంగా వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. పంపిణీ తేదీని త్వరలో తహసీల్దార్ ప్రకటిస్తారన్నారు. ఈ విషయాన్ని గమనించి ఎవరూ కార్డులను పంపిణీ చేయొద్దని సూచించారు.