PLD: ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై కాంట్రాక్ట్ కార్మికుడు మృతి చెందిన సంఘటన మాచర్ల మండల పరిధిలోని జమ్మలమడుగులో బుధవారం జరిగింది. వెల్దుర్తి మండల పరిధిలోని గొట్టిపాళ్ల గ్రామానికి చెందిన ముప్పారపు సురేష్ విద్యుత్ లైన్ ఏర్పాటు పనులు చేస్తుండగా విద్యుత్ షాక్ గురై స్తంభంపై నుంచి పడి మృతి చెందాడు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.