ప్రకాశం: యర్రగొండపాలెం పట్టణంలో బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా బీజేపీ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం, మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి, కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా, దేశ ప్రధాని నరేంద్ర మోడీ భారతదేశాన్ని అగ్రదేశాల సరసన నిలబెడుతున్నారని నాయకులు అన్నారు.