MBNR: ఓయూ నిర్వహించిన పీజీ ప్రవేశ పరీక్షల్లో జడ్చర్ల డా.బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు సత్తా చాటారు. వృక్ష శాస్త్రంలో నలుగురు విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరినట్లు ప్రిన్సిపల్ సుకన్య తెలిపారు. ఈ ప్రవేశ పరీక్ష ఫలితాల్లో శైలజ 4వ ర్యాంక్, గీతాంజలి 23వ ర్యాంక్, అరుణ 227వ ర్యాంక్, వనజ 361వ ర్యాంక్ సాధించారు.