TG: హైదరాబాద్లోని అబ్దుల్లాపూర్మెట్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానిక యశోదనగర్ కాలనీలో నివాసముంటున్న భార్యాభర్తలు శ్రీనివాస్, లక్ష్మి తమ ఇద్దరు పిల్లలతో కలిసి రోడ్డు దాటుతుండగా కంటైనర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీనివాస్ అక్కడికక్కడే మృతిచెందగా.. లక్ష్మి, ఇద్దరు పిల్లలకు గాయాలయ్యాయి. వారిని హుటాహుటిన స్థానికులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.