హైదరాబాద్ మెట్రో రైళ్లో రెగ్యులర్ గా ప్రయాణించే వారికి షాక్! ఇప్పటికే మెట్రో ప్రయాణ ఛార్జీల్లో రాయితీలను (metro rail offers) ఎత్తివేసింది. ఇప్పుడు మరిన్ని కోతలకు, అలాగే ఛార్జీల పెంపుకు సిద్ధమైనట్లుగా (metro fare hike) తెలుస్తోంది. మెట్రో మాల్స్, వారికి కేటాయించిన స్థలాల్లో ఇప్పటి వరకు ఉచిత పార్కింగ్ (parking charges) సదుపాయం ఉంది. దీనిని ఉపసంహరించుకోనుంది. మాల్స్ వద్ద ఇప్పటికే పార్కింగ్ ఫీజు బోర్డులు కనిపిస్తున్నాయి. అంటే అక్కడ పార్క్ చేస్తే డబ్బులు కట్టవలసిందే. హైదరాబాద్ మెట్రో రైలు లిమిటెడ్ (hyderabad metro rail limited) స్టేషన్ల వద్ద రోడ్డు పక్కన పార్కింగ్ ఫీజును (parking fee) వసూలు చేస్తోంది. అలాగే, మూసారాంబాగ్, ఎర్రమంజిల్, పంజాగుట్ట, మాదాపూర్ లలో మాల్స్ కట్టారు. ఇక్కడ పార్కింగ్ సదుపాయం ఉంది. మియాపూర్, ఉప్పల్ డిపోల్లోను పార్కింగ్ సౌకర్యం ఉంది. ఇప్పుడు ప్రయాణీకుల సంఖ్య క్రమంగా పరుగుతుండటంతో దీనిని ఆదాయంగా మార్చుకోవాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో నాలుగు గంటలు అంతకంటే ఎక్కువ సేపు బైక్ నిలిపితే రూ.25, కారుకు రూ.75 వసూలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే మాల్ ను సందర్శించేందుకు వచ్చిన వారికి మాత్రమే మినహాయింపు ఇవ్వనున్నారు.
మెట్రో రైలులో రోజు ప్రయాణించే వారికి స్మార్ట్ కార్డ్, దాంతో స్వల్ప రాయితీ మినహాయింపు ఉండేది. ఈ స్వల్ప మినహాయింపును కూడా ఇప్పుడు రద్దు చేసి, పూర్తిగా వసూలు చేస్తున్నారు (Latest News on Rail Passenger Fare Hike). స్మార్ట్ కార్డు పైన లక్షల్లో ప్రయాణిస్తున్నారు. రాయితీ తొలగింపుపై ప్రయాణీకులు మండిపడుతున్నారు. సూపర్ సేవర్ ఆఫర్ కార్డ్ ద్వారా ఆఫ్-పీక్ హవర్స్ లో అంటే రద్దీ లేని సమయంలో ప్రయాణిస్తే 10 శాతం డిస్కౌంట్ ఉంటుంది. ఈ కార్డు ఛార్జీని రూ.59 నుండి రూ.99కి పెంచారు. మరోవైపు, చార్జీలు పెంచుకుంటామని మెట్రో నిర్వహణ సంస్థ ఎల్ అండ్ టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ప్రభుత్వం ఆమోదంతో ఛార్జీల పెంపు ఉంటుందని అంటున్నారు.