TG: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికకు ముహుర్తం ఖరారైంది. జూలై 1న ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో ఈనెల 29న ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. 30న నామినేషన్లు స్వీకరించనున్నారు. ప్రస్తుతం కిషన్ రెడ్డి బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న విషయం తెలిసిందే.